హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లిలో ఇసుక ట్రాక్టర్ ఢీకొని మహిళ మరణించింది. తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన భోగి రామవ్వ(70) అర్ధరాత్రి 3గంటల ప్రాంతంలో ఇసుక ట్రాక్టర్ ఢీకొని మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలైయ్యాయి. గాయపడిన వారి స్థానిక ఆస్పత్రికి తరలించి అందిస్తున్నారు. ఈ సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు మహిళ మృతదేహం పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm