హైదరాబాద్: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ చెట్టును ఢీకొనడంతో ఒకరు మరణించగా, మరో 25 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలోని కొచ్చి నగర సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. తిరువనంతపురం నుంచి కోజికోడ్ నగరానికి వస్తున్న కర్ణాటక సూపర్ డీలక్సు బస్సు కొచ్చి నగర సమీపంలోని చక్కర పరంబు వద్ద ప్రమాదవశాత్తూ చెట్టును ఢీకొంది. నాలుగు లేన్ల రహదారిపై వస్తున్న బస్సు చెట్టును ఢీకొనడం వల్ల బస్సుడ్రైవరు అరుణ్ సుకుమారన్ అక్కడికక్కడే మరణించారు. బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడటంతో వారిని రెండు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm