హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లో షాదోల్ జల్లా ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఆస్పత్రిలో వైద్యులు, ఇతర సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 24 గంటల వ్యవధిలో నలుగురు పసికందులు మృతిచెందారు. ఆస్పత్రి సిబ్బంది వల్ల పసిబిడ్డలను కోల్పోవాల్సి వచ్చిందని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఆరోపణలను ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ తోసిపుచ్చారు. పసికందుల మృతి విషయంలో తమ తప్పిదమేమీ లేదన్నారు. చిన్నారులందరినీ సీరియస్ కండిషన్‌లో ఇక్కడికి తీసుకొచ్చారని, అందుకే వారిలో కొందరు మరణించారని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm