హైదరాబాద్ : బిగ్‌బాస్ 4 ఈ వారంతో పన్నెండు వారాలను పూర్తి చేసుకుంటోంది. అయితే ఈ వారం బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌ను అలరించడానికి కన్నడ స్టార్ సుదీప్ గెస్ట్‌గా బిగ్‌బాస్ స్టేజ్‌పైకి అడుగుపెట్టారు. తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమో యూట్యూబ్ లో వైరల్ అయ్యింది. ఇక ఈ విషయాన్ని సుదీప్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటిస్తు. 'బిగ్‌బాస్‌కి వ్యాఖ్యాతగా చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఈరోజు తెలుగు బిగ్‌బాస్‌కి గెస్ట్‌గా వెళ్లినందుకు, ఎప్పుడూ అందంగా ఉండే నాగార్జున గారితో స్టేజ్‌ను షేర్ చేసుకున్నందుకు.. కంటెస్టెంట్స్‌తో మాట్లాడినందుకు మరింత హ్యాపీగా ఉంది' కిచ్చా సుదీప్ ట్వీట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm