హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశ రాజదాని ఢిల్లీలో రైతులు కొనసాగిస్తున్న అందోళనలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడులను, నిర్భంధాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఉధృతంగా కొనసాగుతున్న రైతాంగ ఉద్యమాలను పరిగణనలోకి తీసుకొని వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతున్నది.
పార్లమెంటులో అక్రమంగా చేసిన వ్యవసాయ చట్టాలపై గత నెల నుండి దేశ వ్యాప్తంగా రైతులు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున అందోళనలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఎముకలు కోరికే చలి, తిండి తిప్పలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులపాలౌతున్నారు. వారిపై వాటర్ క్యానన్‌లు, బాష్ప వాయువులు ప్రయోగిస్తూ దమనకాండకు పాల్పడుతున్నది. ఎన్‌డీఏయేతర పార్టీలు ఈ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అన్నం పెట్టె రైతన్నను అధోగతి పాల్జేస్తున్నదీ బీజేపీ ప్రభుత్వం. ఈ చట్టాలు అమలుచేయడమంటే దేశ రైతాంగాన్ని పెట్టుబడి దారులకు తాకట్టు పెట్టడమే.
తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులతో తక్షణం చర్చలు చేయకుండా డిసెంబర్ 3వ తేదీన చర్చిస్తామని కేంద్రం ప్రకటించడం అమానుషం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే రైతులకు వ్యతిరేకంగా వున్న మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకొని రైతులు పడుతున్న అందోళనను ఆపాలి. పంజాబ్, హర్యానా రైతుల ఉద్యమాలకు మద్దతు ప్రకటిస్తూ, సమస్యల పరిష్కారమయ్యే వరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు కొనసాగుతున్న సమరశీల పోరాటాలు కొనసాగించాలని సిపిఐ(ఎం) కోరుతున్నది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 29 Nov,2020 04:06PM