హైదరాబాద్: టీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ చెత్త రాజకీయం చేస్తోందన్నారు. బీజేపీ, ఎంఐఎం పార్టీలు మతరాజకీయాల కోసం కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ విలువలతో కూడిన రాజకీయం చేస్తోందన్నారు. బండి సంజయ్‌కు భాగ్యలక్ష్మి ఆలయం ఇప్పుడు గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. పటాన్‌చెరువుకు మంత్రి హరీశ్‌రావు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm