హైదరాబాద్: ఆఫ్ఘనిస్తాన్‌లో ఆదివారం ఆత్మాహుతి కారు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 26 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారని అధికారులు తెలిపారు. తూర్పు ప్రావిన్స్‌లో ఘజ్ని రాజధాని శివార్లలో ఈ దాడి జరిగింది. ఇప్పటి వరకు 26 మృతదేహాలను గుర్తించామని, మరో 17 మంది వరకు గాయపడ్డారని పేర్కొన్నారు. వారంతా భద్రతా సిబ్బందేనని, గాయపడ్డ వారిని ఘజ్ని హాస్పిటల్ డైరెక్టర్ బాజ్ మహ్మద్ హేమత్ చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm