నవతెలంగాణ - అశ్వారావుపేట
ఇటీవల కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు ప్రయోజనం పేరుతో కార్పోరేట్ వ్యవసాయదారులకు మేలుచేసే వ్యవసాయ బిల్లులను బేషరతుగా ఉపసంహరించుకుని పంట కనీస మద్దతు ధర (ఎం.ఎస్.పి) చట్టబద్దం చేయాలని సిపిఐ ఎం ఎల్ (ఎన్ డి) రాష్ట్ర కార్యదర్శి వర్గం సభ్యులు,ఎఐకెఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసారు. ఆయన ఆదివారం అశ్వారావుపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం రైతులకు నష్టం చేకూర్చే మరో విద్యుత్ సంస్కరణలు చట్టం తేబోతుందని దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ చట్టం అమలు చేస్తే రైతుకు ఉచిత విద్యుత్ రద్దు, శ్లాబ్ ల పద్దతి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేసారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి ప్రజలను ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గోకినపల్లి ప్రభాకర్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 29 Nov,2020 01:10PM