హైదరాబాద్: ఈరోజు ప్రధాని మోడీ తెలంగాణలోని భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో రాజీవ్ రహదారిపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రధాని కాన్వాయ్ వెళ్లే సమయంలో భద్రత దృష్ట్యా రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మోడీ ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌పోర్టుకు ప్రధాని చేరుకుంటారు. అటునుంచి శామీర్‌పేట మండలం తుర్కపల్లిలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఉత్పత్తి యూనిట్‌కు వెళ్తారు.
Mon Jan 19, 2015 06:51 pm