హైదరాబాద్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. కేవలం 31 బంతుల్లోనే 4 సిక్సర్లు, 3 ఫోర్లతో హార్దిక్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 101 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమ్‌ను ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు యాంకర్ రోల్ ప్లే చేస్తున్న ధావన్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 29 ఓవర్లకు 201/4గా ఉంది. పాండ్య 69, దావన్ 58 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm