హైదరాబాద్ : ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విశాఖపట్టణంలో కాపులుప్పాడ కొండపై అతిథి గృహ నిర్మాణం చేపట్టవద్దని అమరావతి జేఏసీ నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం న్యాయస్థానం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున న్యాయవాది మురళీధర్ వాదనలు వినిపించారు. గ్రే హాండ్స్‌కి ఇచ్చిన స్థలంలో అతిథి గృహం ఎలా నిర్మిస్తారని ప్రశ్నిస్తూ..వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
Mon Jan 19, 2015 06:51 pm