హైదరాబాద్ : ఖమ్మం జిల్లాలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 13 మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. తనికెళ్ల శివారులోని విజయ కాలేజీ సమయంలో ఎదురెదురుగా వచ్చిన మణుగూరు, సత్తుపల్లి డిపోకు చెందిన బస్సులు తనికెళ్ల వద్ద విజయా కాలేజీ సమయంలో ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న సుమారు 13 మంది వరకు గాయపడ్డారు. రెండు బస్సులు ఒక్కసారిగా ఢీకొట్టుకోవడంతో అందులో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm