హైదరాబాద్: శాంతి భద్రతలపై సీఎం కేసీఆర్, డీజీపీ ప్రకటనపై బిజెపి నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే శాంతిభద్రతలు తెరపైకి తెచ్చారని.. బీజేపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ కుట్రలను గవర్నర్‌కు వివరించామన్నారు. ఓటర్ల జాబితా నుంచి దొంగ ఓట్ల వరకూ టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతోందన్నారు. హైదరాబాద్‌లో అల్లర్లు జరగాలని టీఆర్ఎస్ కోరుకుంటోందన్నారు. శాంతిభద్రతల సమస్య సృష్టించి.. ఎన్నికలు వాయిదా వేయాలని టీఆర్ఎస్ చూస్తోందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm