హైదరాబాద్ : అర్హులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించడం లేదని బోధన్ మండలం పెద్ద మావంది గ్రామంలో డబల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రిలే దీక్షలు గ్రామస్థులు రిలే దీక్షలు నిర్హహించారు. ఈ సందర్భంగా రీలే దీక్షలను ఉద్దేశించి సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ బోధన్ డివిజన్ కార్యదర్శి పి. వరదయ్య మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించడంలేదని అన్నారు. కేవలం టీఆర్ఎస్ పార్టీకి చెందిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే ఇండ్లను కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటికైనా అర్హులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేసారు.
Mon Jan 19, 2015 06:51 pm