హైదరాబాద్ : గుట్కా ప్యాకెట్లను అక్రమంగా దుకాణాలకు అమ్ముతున్న వ్యక్తిని ఖమ్మం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మధిర మండలం అల్లినగారం గ్రామానికి చెందిన ఎలబండ కిరాణా షాపులో గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. గురువారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు మధిర పోలీసులతో కలిసి దుకాణాన్ని తనిఖీ చేసి రూ. ౩ లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm