హైదరాబాద్ : ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక నెల్లూరు జిల్లాలలో అత్యదికంగా వర్షం కురుస్తుంది. నెల్లూరు జిల్లా తిప్పవారిపాడు వద్ద రెండు వాగుల మధ్య ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. బస్సులో సుమారుగా 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రాణాలు రక్షించుకునేందుకు బస్సు దిగిన ఇద్దరు గల్లంతయ్యారు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. ప్రయాణికులను కాపాడేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm