హైదరాబాద్ : 20 ఏళ్ల యువతిని అడవిలో బంధించి 14 రోజులు పాటు లైంగికదాడికి పాల్పడ్డాడు ఓ కామంధుడు. ఈ దారుణమై సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. నవంబర్ 9న తన మామ ఇంట్లో జరిగే వివాహానికి వెళ్లింది యువతి. తన మామ ఇంటి నుంచి సరదగా బయటకు వచ్చింది. బుండి జిల్లాలోని కప్రేన్‌కు చెందిన ఫోరులాల్ ఆడ్ అది గమనించి.. ఇక్కడ మంచి ప్రదేశాలు చాలా ఉన్నాయని.. తనతో వస్తే చూపిస్తానని చెప్పి యువతిని మోటారుసైకిల్ మీద కోట జిల్లాలోని మందనా సమీపంలో ఉన్న ఒక అడవికి తీసుకెళ్లాడు. అక్కడ యువతిని బంధించి 14 రోజుల పాటు లైంగికదాడి చేశాడు. ఆమెకు చెందిన వస్తువులన్నీ ఒక పక్కన పడేశాడు. నవంబర్ 22న ఫోరులాల్ లేని సమయంలో యువతి తన ఫోన్ వెతికి తన తండ్రికి సమాచారమిచ్చింది. దాంతో ఆమె తండ్రి ఆమెను వెతుక్కుంటూ వచ్చి తీసుకెళ్లాడు. యువతి తన తండ్రితో కలిసి బారన్ జిల్లాలోని ఆంటా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు పోలీసులు.
Mon Jan 19, 2015 06:51 pm