హైదరాబాద్ : కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు దేశ వ్యాప్త సమ్మెకు కార్మిక, కర్షక సంఘాలు పిలుపునిచ్చాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కార్మిక సంఘాలు, కర్షక సంఘాలు పెద్ద ఎత్తున్న ఉద్యమాలు చేపడుతున్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ ఆందోళనలు మొదలయ్యాయి. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ నిరసన గళాలను వినిపిస్తున్నాయి. పలు చోట్ల నేతల నిర్బంధాలు, అడ్డగింతలు చోటుచేసుకున్నా...నిరసనకారులు ఆందోళనలు చేపడుతూనే వున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm