హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో కరెంట్ షాక్ తగిలి యువకుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన దామెర మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వేల్పుల మొండయ్య(50) అతడి కుమారుడు మహేష్ (24) తో కలిసి ఇంట్లో కరెంట్ తీగలు రిపేరు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి మహేష్ మృతి చెందాడు. తండ్రి పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm