హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య ఒకరోజు పెరుగుతూ.. మరుసటి రోజు తగ్గుతూ ఉంది. తాజాగా వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా మరో 862 మందికి పాజిటివ్‌గా నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకినవారి సంఖ్య 2,66,904కి పెరిగింది. కరోనాతో మరో ముగ్గురు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,444కి చేరింది. తాజాగా 961 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,54,676కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 10,784 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm