హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు, రైతులకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. నివర్ తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో నేడు, రేపు పంటలను కోయొద్దని, పంటను మార్కెట్లకు తేవద్దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. నివర్ తుఫాన్ వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణ కేంద్రం ప్రకటించింది. చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. ప్రధానంగా నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు.. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, యాదాద్రి జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.
Mon Jan 19, 2015 06:51 pm