హైదరాబాద్ : నివర్ తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. అర్ధరాత్రి తీరం దాటిన తుఫాన్ కారణంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ కారణంగా తిరుమలలో భారీ వర్షం కురుస్తున్నది. బలమైన గాలులు, భారీ వర్షం వల్ల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతున్నాయి. రెండో ఘాట్ రోడ్ హరిణి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది జేసీబీ సాయంతో కొండచరియలను తొలగిస్తున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి శ్రీవారి ఆలయంలోకి వర్షపు నీరు చేరాయి. దీంతో సిబ్బంది మోటార్ల సహాయంతో నీటిని బయటకు పంపుతున్నారు. బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్ వద్ద ప్రహారీ గోడ కూలగా, బైక్‌లు ధ్వంసం అయ్యాయి. ఏపీలో పలు జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు మోహరించాయి. అన్ని విభాగాలను ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm