హైదరాబాద్ : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లికూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు దాటుతుండగా జనగామ వైపునుంచి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి వారిని ఢీకొట్టింది. దీంతో షేక్ ఆశా అనే మహిళ ఎగిరి కారు అద్దానికి బలంగా తాకడంతో తలకు తీవ్ర గాయలవ్వగా.. ఆమె కుమార్తెకు చేయి విరిగింది. ఆశా పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm