హైదరాబాద్ : అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు ఆ ఊరిలో హాట్ టాపిక్ గా మారింది. వికారాబాద్ జిల్లా థారూర్ మండలం కెరెళ్లి ఊరులో ఈ ఘటన జరిగింది. కెరెళ్లి నాలుగో వార్డు మెంబర్ బుచ్చయ్య ఇల్లు కట్టుకున్నాడు. కరెంటు స్థంభాన్ని కలుపుకుని మరీ ఇల్లు కట్టాడు. ఎందుకిలా చేశావ్ అని అడిగితే.. చాలా రోజుల నుంచి కరెంట్ ఆఫీస్ వాళ్లను బతిమాలుకున్నాడట. ఆ విద్యుత్ స్థంభాన్ని అక్కడి నుంచి తీసి అటో ఇటో జరపాలని దరఖాస్తు కూడా పెట్టుకున్నాడట. కానీ అధికారులు అస్సలు పట్టించుకోలేదట.అంతేకాదు స్థంభాన్ని జరపాలంటే రూ.3 లక్షలు ఖర్చు అవుతాయని అధికారులు చెప్పారట. దీంతో బుచ్చయ్య కంగుతిన్నాడు. 3లక్షలు పెడితే సగం ఇల్లే కట్టడం అయిపోతుందని భావించి తెగించాడు. ఇక లాభం లేదనుకుని ఏకంగా విద్యుత్ స్థంభాన్ని కలుపుకుని ఇల్లు కట్టేశాడు.
Mon Jan 19, 2015 06:51 pm