హైదరాబాద్ : షార్జాలో భారత కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. షార్జాలోని అల్ హమ్రియా ప్రాంతంలోని అతడి నివాసంలోనే ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఇది గమనించిన తోటి కార్మికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులతో పాటు ఘటనాస్థలిని పరిశీలించిన క్రిమినల్ దర్యాప్తు బృందాలకు మృతుడిపై హత్యాయత్నం జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm