హైదరాబాద్ : కామారెడ్డి సీఐ జగదీష్ బ్యాంక్ లాక్‌ర్‌లో భారీగా నగదును స్వాదీనం చేసుకున్నారు అదికారులు. నిజామాబాద్ కంఠేశ్వర్ యాక్సిస్ బ్యాంకు లాకర్‌లో నగదు, బంగారం, ఆస్తి పత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రూ.34.40 లక్షలు. రూ. 9.12 లక్షల విలువైన బంగారు ఆభరణాలను గుర్తించారు. అవినీతి ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో కామారెడ్డి పట్టణ సీఐ జగదీష్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేసిన సంగతి తెలిసిందే. విచారణలో సీఐ అవినీతికి పాల్పడ్డట్లు తేలడంతో ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm