హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 694 పాయింట్లు కోల్పోయి 43,828కి పడిపోయింది. నిఫ్టీ 196 పాయింట్లు నష్టపోయి 12,858కి దిగజారింది. టెలికాం, రియాల్టీ, బ్యాంకెక్స్, హెల్త్ కేర్ సూచీలు ఎక్కువగా నష్టపోయాయి.
Mon Jan 19, 2015 06:51 pm