హైదరాబాద్ : ప్రముఖ హీరోయిన్ రష్మికా మందన్న పలు ఆసక్తికర విషాయాలను ఉపాసన కొణిదెల నిర్వహిస్తున్న 'యువర్ లైఫ్' వెబ్ పోర్టల్‌లో చెప్పింది. రష్మికా ఇటీవల ఈ కార్యక్రమానికి గెస్ట్ ఎడిటర్‌గా హాజరైంది. 'రీఛార్జ్ యువర్ లైఫ్ విత్ రష్మిక' పేరుతో రూపొందిన ఈ కార్యక్రమంలో రష్మిక పలు ఆరోగ్య సూత్రాలను చెప్పింది. చికెన్ పుట్టు కర్రీ ఎలా వండాలో చూపించింది. ఆ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. కర్ణాటకలోని తన సామాజిక వర్గం -కోర్గి- గురించి చెప్పింది. తమ సామాజిక వర్గం వారు ఎక్కువగా పంది మాంసం తింటారని తెలిపింది. పంది మాంసం తమ సాంప్రదాయ వంటకమని, నిప్పు మీద కాల్చి తింటామని చెప్పుకొచ్చింది. అంతేకాదు తమ సామాజిక వారు ఇంట్లోనే వైన్ తయారు చేసుకుని తాగేందుకు ఇష్టపడుతారని పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm