హైదరాబాద్ : ఆరోగ్య సేవల్లో అగ్రగామి కంపెనీల్లో ఒకటైన జిఎస్‌కె కన్సూమర్ హెల్త్‌కేర్ నేడు భారతదేశంలో పాలిడెంట్‌ను విడుదల చేసింది. సైన్సు నుంచి పొందిన మద్దతుతో రూపొందించిన పాలిడెంట్ దంతాల సంరక్షణలో గ్లోబల్ లీడర్‌గా మరియు కట్డుడు పళ్లు ధరించే వారికి సౌఖ్యత, స్వచ్ఛత మరియు నోటి ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులను అందిస్తుంది. దీని విడుదలతో జిఎస్‌కె ప్రత్యేకమైన కట్టుడు పళ్ల సంరక్షణ విభాగానికి ప్రవేశించగా, మొత్తం మీద నోటి ఆరోగ్య సంరక్షణ విభాగంలో తన అస్తిత్వాన్ని మరోసారి ధ్రువీకరించింది. నేడు జిఎస్‌కెను భారతదేశంలో లక్షలాది మంది కట్టుడు పళ్ల సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించే వారిలో అర్థవంతమైన మార్పును తీసుకు రావడాన్ని సాధ్యం చేయగా, ఇది ప్రజలకు ఎక్కువ పని చేసేందుకు, ఉత్తమ భావన పొందేందుకు మరియు దీర్ఘకాలిక జీవితాన్ని కొనసాగించేందుకు ఉత్పత్తులను పరిచయం చేసే ఉద్దేశానికి అనుగుణంగా ఉంది.
నేడు కట్టుడు పళ్లను పెట్టుకునే వారిలో ఎక్కువ మంది తినే సమయంలో, మాట్లాడే సమయంలో లేదా నవ్వే సమయంలో అస్వస్థతను ఎదుర్కొంటారు. పాలిడెంట్ డెంచర్ ఫిక్సేటివ్ క్రీమ్ కట్టుడు పళ్లకు సంరక్షణ మరియు చిగుర్ల కోశాల మధ్య అంటుకుని ఉంటూ, ఆహారం తునకలు చేరుకోకుండా, రోజంతా సదృఢంగా కట్టుడు పళ్లను అంటుకుని, దాని గురించి ఎటువంటి ఆలోచనలు లేకుండా విశ్వాసంతో జీవించేందుకు సహకారాన్ని అందిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కట్టుడు పళ్లను పెట్టుకునే వారి జీవితంలో పాలిడెంట్ నాణ్యతతో కూడిన గమనార్హమైన మార్పును తీసుకు వచ్చింది. ఈ ఉత్పత్తిలో జింకు, కృత్రిమ వర్ణాలు మరియు రుచి లేకపోవడంతో ఆహారం రుచిలో ఎటువంటి మార్పులేకుండానే ఆస్వాదించవచ్చు.
జిఎస్‌కె కన్సూమర్ హెల్త్‌కేర్ నోటి ఆరోగ్య విభాగం ఏరియా మార్కెటింగ్ డైరెక్టర్ అనురితా ఛోప్రా మాట్లాడుతూ ‘‘నేడు 45 ఏళ్ల పైబడ్డ ప్రతి 7 మంది భారతీయుల్లో 1 వ్యక్తి కట్టుడు పళ్లను ధరిస్తున్నారు. అంటే దేశంలో లక్షలాది మంది కట్టుడు పళ్ల సెట్టును ధరిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. కట్టుడు పళ్లను ధరించే వారిలో కేవలం 5% మంది మాత్రమే స్పెషలిస్ట్ డెంచర్ కేర్ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. జిఎస్‌కె కన్సూమర్ హెల్త్‌కేర్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తులను పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తోంది మరియు దానితో భారతదేశంలో పాలియెంట్ డెంచర్ ఫిక్సేటివ్ పరిచయం చేసి, ఈ అంతరాన్ని భర్తీ చేయాలని నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారుల ప్రాధాన్యత మరియు అగ్రగామి డెంచర్ కేర్ బ్రాండ్‌గా మేము భారతదేశంలో కట్టుడు పళ్లను ధరించే వారి నుంచి ఈ ఉత్పత్తికి చక్కని మద్దుతు లభిస్తుందని’’ ధీమా వ్యక్తం చేశారు.
పాలిడెంట్ డెంచర్ ఫిక్సేటివ్ భారతదేశ వ్యాప్తంగా ఫార్మసీలు మరియు అగ్రగామి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారాల్లో లభిస్తుంది. ఇది 20 గ్రాముల ప్యాక్ పరిమాణంలో రూ.315కు లభిస్తుంది.
డెంటల్ నిపుణులు మరియు కెమిస్టులు భారతదేశంలో కొత్తదైన ఈ విభాగానికి ఒక రూపాన్ని ఇవ్వడంలో ప్రముఖ పాత్ర పోషించనున్నారు. దానితో కంపెనీ నిపుణులతో భారతదేశపు ప్రథమ డెంచర్ కేర్ మార్గసూచికలను అభివృద్ధి చేస్తుండగా, అది దేశంలో డెంచర్ కేర్ ఉత్పత్తుల వినియోగానికి మార్గదర్శకాలను తీసుకు రానుంది. దీని విడుదలకు సదృఢమైన మాధ్యమాల మద్దతు కూడా ఉంది.
దీన్ని విడుదల చేస్తున్న సందర్భంలో భారతదేశంలో జిఎస్‌కె నోటి ఆరోగ్యం ఉత్పత్తుల విభాగాన్ని బలోపేతం చేసుకుంటుండగా, దీన్ని ఈ రంగంలో అత్యంత ప్రముఖ సంస్థల్లో ఒకటిగా నిలిపింది. నోటి ఆరోగ్యానికి సంబంధించిన పోర్ట్‌పోలియోలో సెన్సోడైన్ శ్రేణి టూత్ పేస్ట్ మరియు టూత్ బ్రష్ ఉండగా, ఇవి సెన్సిటివిటీ కలిగిన దంతాలతో సమస్యలు ఎదుర్కొంటున్న వారి కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 Nov,2020 03:35PM