హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా నాంపల్లి నియోజకవర్గం విజయనగర్ కాలనీ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఫాతిమా ముస్లిం కాదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఆమె హిందువు అని, రాజకీయం కోసం తండ్రి పేరును మార్చారని విమర్శించారు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో నామినేషన్ వేసినందుకు ఆమెపై ముషిరాబాద్ పోలీసు స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైందని ఒవైసీ ఆరోపించారు.
Mon Jan 19, 2015 06:51 pm