హైదరాబాద్ : ఆసీస్ తో జరగనున్న తొలి రెండు టెస్టులకు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, బౌలర్ ఇషాంత్ శర్మ దూరం కానున్నారు. చివరి రెండు టెస్టులకు కూడా వీరిద్దరు ఆడటం అనుమానమే అని సమాచారం. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌కు రోహిత్, ఇషాంత్ ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే గాయపడిన వీరిద్దరు ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో కోలుకుంటున్నారు. కాగా, వీరిద్దరు పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరో కొన్ని వారాల సమయం పడుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
Mon Jan 19, 2015 06:51 pm