హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసి షాకిచ్చింది. దిశ ఎన్‌కౌంటర్ మృతుల కుటుంబాలు ఇప్పటికే మనోవేదనకు గురవుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది కృష్ణమూర్తి కోర్టుకు తెలిపారు. ఈ చిత్రాన్ని నిర్మించి వారిని గ్రామంలో కూడా ఉండనివ్వకుండా చేస్తున్నారని, చిత్రంలో వారిని దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని పిటిషనర్ తరపు లాయర్ పేర్కొన్నారు. దిశ చిత్రం విడుదల కాకుండా స్టే ఇవ్వాలని ఆయన కోరారు. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Mon Jan 19, 2015 06:51 pm