హైదరాబాద్ : HDFC Bank Ltd. భారతదేశంలో Most Outstanding Company – Financial Sector అనే గౌరవాన్ని దక్కించుకోగా, దీన్ని ప్రఖ్యాత పత్రిక ఆసియా మనీ నిర్వహించిన ఓటింగ్‌లో ఎంపిక చేశారు. 824 ఫండ్ మేనేజర్లు, బై-సైడ్ అనలిస్టులు, బ్యాంకర్లు మరియు రీజన్ అనలిస్టులు, ఆసియాకు చెందిన 12 మార్కెట్లలో ఓటింగ్ చేశారు. 4,000 పైచిలుకు ఓట్లను పబ్లిక్ లిస్టెడ్ కంపెనీల నుంచి స్వీకరించారు. ఆసియామనీ సమీక్షలో పాల్గొనే వారిని కంపెనీ ఆర్థిక, పాలక మండలి బృందం, ఐఆర్ లావాదేవీలు మరియు సిఎస్‌ఆర్ కార్యక్రమాలతో కూడిన మొత్తం మీద పనితీరును పరిగణనలోకి తీసుకుని ఓటు ఇవ్వాలని కోరింది. ఆసియాలోని అసాధారణ కంపెనీల ఓటింగ్‌గా ఖ్యాతి పొందిన ఇది 2 విభాగాల్లో లిస్ట్ అయిన కంపెనీలను గుర్తిస్తుంది మరియు గుర్తింపు ఇస్తుంది: దేశానికి మరియు వలయానికి అనుగుణంగా ఉంటుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు వరుసగా 2వ ఏడాది ఈ గౌరవాన్ని దక్కించుకుంది.
చైనా, హాంగ్‌కాంగ్, భారత్, ఇండోనేసియా, కొరియా, మలేషియా, పాకిస్తాన్, ఫిలిప్పైన్, సింగపూర్, తైవాన్, థాయిల్యాండ్ మరియు వియత్నాంలతో కలిసిన 12 మార్కెట్ల పరిధిని ఇది కలిగి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 Nov,2020 04:06PM