హైదరాబాద్: అసెంబ్లీ ముందు దంపతులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. ఈ ఘటన భువనేశ్వర్‌లోని అసెంబ్లీ ప్రాంగణం ముందు జరిగింది. జూలైలో అయిదేళ్ల కూతుర్ని లైంగికదాడి చేసి హత్య చేశారని, ఆ దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ చిన్నారి తల్లితండ్రులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో దంపతులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm