హైదరాబాద్ : నగరంలో డ్రగ్స్ తయారీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించి ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. నాచారం హెచ్‌ఎంటీ నగర్‌లో అక్రమంగా డ్రగ్స్ తయారు చేస్తున్నారని ఆబ్కారీ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించి రూ.40 లక్షల విలువైన ఆల్ఫాజోలం పౌడర్, యంత్రాలను సీజ్ చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఆబ్కారీశాఖ పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm