హైదరాబాద్ : మనం అత్యాశతో అందరినీ ముప్పులో పడేస్తాం’’ అనేది ఓ ప్రఖ్యాత సూక్తి. విఫలమైన పెళ్లిని కాపాడుకునేందు కు పోరాటం చేస్తున్న మానిష్ అనే మధ్యతరగతి వ్యక్తి జీవితాన్ని ఈ సూక్తి నిర్వచిస్తుంది. తన భవిష్యత్ ను మ లుపు తిప్పే తన వ్యాపార ఆలోచనకు ఇన్వెస్ట్ చేసే వారి వేటలో ఉన్న మానిష్ తట్టింది మాత్రం తప్పు ద్వారా న్ని. అదే ఆయన జీవితాన్ని మలుపులు తిప్పుతుంది. స్కామ్ 1992 ఘనవిజయం అనంతరం SonyLIV మీ కు అందిస్తోంది ఈ మల్టీ స్టారర్ ‘ఎ సింపుల్ మర్డర్’. హాస్యం, థ్రిల్ కలగలసిన ఈ సిరీస్ నవంబర్ 20 నుంచి ఏడు ఎపిసోడ్స్ గా రానుంది. వీక్షకులకు ఇది డార్క్ కామెడీని అందించనుంది.
మల్టీ స్టార్ మరియు డార్క్ కామెడీతో నిండిన ‘ఎ సింపుల్ మర్డర్’ కు సచిన్ పాఠక్ దర్శకత్వం వహించారు. రచన ప్రతీక్ పయోధి. అత్యాశ అనేది మనుషులను ఎలా మారుస్తుందో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనల్లోకి లా గుతుందో తెలియజేస్తుంది. రొటీన్ గా మారిన జీవితంతో విసుగెత్తి లేదా సురక్షిత భవితను పొందాలనే కోరికతో భిన్న పోకడలకు చెందిన వారు హద్దులు దాటుతుంటారు. మెరుగైన జీవితాన్ని పొందేందుకు రిస్క్ తీసుకునేం దుకు సిద్ధపడుతుంటారు. జార్ పిక్చర్ నిర్మించిన ఈ సిరీస్ లో మొహమ్మద్ జీషాన్ ఆయూబ్, సుశాంత్ సింగ్, అమిత్ సియాల్ తిరుగులేని విధంగా నటించారు. సగటు మనిషి డ్రామెడీతో ఇది కొనసాగుతుంది.
ప్రియా ఆనంద్, యశ్ పాల్ శర్మ, గోపాల్ దత్, అయాజ్ ఖాన్ తదితరులు నటించిన ‘ఎ సింపుల్ మర్డర్’ SonyLIV లో మాత్రమే నవంబర్ 20 నుంచి ప్రసారం కానుంది.
సౌగతా ముఖర్జీ, హెడ్ – ఒరిజినల్ కంటెంట్, SonyLIV
డార్క్ కామెడీలు ఎంతో శక్తివంతమైనవే అయినప్పటికీ ఓటీటీ విభాగం మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కడక్ ఎన్నో ప్రోత్సాహకర సమీక్షలను పొందింది. దాని తర్వాత ఈ విభాగంలో అందిస్తున్న రెండో సిరీస్ ‘ఎ సింపుల్ మర్డర్’. వీక్షకులకు వైవిధ్యభరిత కంటెంట్ ను అందించడంలో మా విశ్వాసాన్ని ఇది పునరుద్ఘాటిస్తుంది. అద్భుతమైన తారాగణంతో, ఉత్కంఠభరిత కథనంతో ఈ సిరీస్ వీక్షకుల నుంచి కూడా సానుకూల స్పందన పొందుతుందని విశ్వసిస్తున్నాం’’
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 Nov,2020 02:14PM