హైదరాబాద్ : దేశంలోని 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న అన్ని (ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగానికి చెందినవి) 73 విద్యుత్ బోర్డులకూ PhonePe చోటు కల్పించింది. తద్వారా 25కోట్ల మంది PhonePe వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను సాఫీగా పే చేసేందుకు వీలు కల్పించింది.
ఈ పరిణామంపై PhonePe బిజినెస్ డెవలప్ మెంట్ విభాగం డైరెక్టర్ అంకిత్ గౌర్ మాట్లాడుతూ, “2016లో విద్యుత్ విభాగాన్ని ప్రారంభించినప్పటినుంచి విద్యుత్ బిల్లులకోసం డిజిటల్ పేమెంట్లు భారీగా పెరిగిన విషయం కనిపించింది. వాస్తవంగా, 2010 అక్టోబర్ నెలలో గత ఏడాది అదే నెలతో పోల్చితే విద్యుత్ బిల్లుల పేమెంట్ పరిమాణంలో 40శాతం పెరుగుదల కనిపించింది. మా కస్టమర్లలో 80%కు పైగా కస్టమర్లు 2, 3, 4 వ శ్రేణి నగరాల్లోనే ఉంటున్నారనే విషయం మాకు ఆనందాన్నిస్తోంది. ఇది కాంటాక్ట్ లెస్ బిల్లు పేమెంట్లను అన్ని వైపులా స్వీకరిస్తున్నారనే విషయాన్ని సూచిస్తోంది.” అని పేర్కొన్నారు.
డిజిటల్ పేమెంట్లలో అగ్రగామిగా ఉన్న PhonePe బిల్లు పేమెంట్ల విభాగాన్ని స్వీకరింపజేయడంలో సహాయపడేలా అనేక రకాల వినూత్నమైన ఫీచర్లను ఆవిష్కరించింది. అలాంటి వినూత్నమైన ఆవిష్కరణల్లో‘రిమైండర్లు” ఫీచర్ కూడా ఒకటి. దీనిని ఉపయోగించడం ద్వారా కస్టమర్లు గడువు తేదీని గుర్తు పెట్టుకోవడం కానీ, తమ విద్యుత్ బిల్లుల భౌతిక ప్రతులను కలిగి ఉండాల్సిన పని కానీ ఉండదు. పే చేయడాన్ని వారికి గుర్తుచేయడం కోసం PhonePeనుంచి వచ్చే ఒక నోటిఫికేషన్ ఆధారంగా వినియోగదారులు యాప్ లో బిల్లు పేమెంట్లు చేయవచ్చు. ప్రతినెలా చెల్లించే బిల్లులను సౌలభ్యకరంగా, ఒడిదుడుకులు లేకుండా చేసేందుకు, కస్టమర్లు PhonePe యాప్ లోని ఆటోపే ఆప్షన్ ను కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆటోపే ద్వారా వినియోగదారులు అనేక రకాల వినియోగ బిల్లుల గడువు తేదీల గురించి ఆందోళన చెందడం కానీ, ఆలస్యపు పేమెంట్ ఛార్జీలను భరించడం గురించి ఆందోళన చెందడం కానీ అవసరం లేదు. వినియోగదారు ఎంపిక చేసిన పేమెంట్ పద్ధతి నుంచి ప్రతినెలా బాకీ మొత్తం డెబిట్ చేయబడుతుంది.
భారతదేశంలోని అగ్రగామి డిజిటల్ పేమెంట్ల వేదిక PhonePeలో 25 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్న వినియోగదారులు ఉన్నారు. PhonePe ద్వారా వినియోగదారులు డబ్బు పంపవచ్చు, స్వీకరించవచ్చు. మొబైల్, DTH, డేటా కార్డులను రీఛార్జ్ చేసుకోవచ్చు. దుకాణాల్లో డబ్బులు చెల్లించవచ్చు. వినియోగ బిల్లులు లాంటివి కట్టవచ్చు. బంగారం కొనుగోలు చేయవచ్చు, పెట్టుబడులు పెట్టవచ్చు. 2017లో డిజిటల్ గోల్డ్‌ను ప్రారంభించడం ద్వారా PhonePe ఆర్థిక సేవల రంగంలో అడుగుపెట్టింది. డిజిటల్ గోల్డ్ ద్వారా వినియోగదారులు 24 క్యారెట్ల బంగారాన్ని సురక్షితంగా తమకు నచ్చిన విధంగా కొనుగోలు చేసే అవకాశాన్ని PhonePe తన వేదికలో అందిస్తోంది. ఆ తరువాత నుంచి PhonePe, మ్యూచువల్ ఫండ్స్‌ను, బీమా ఉత్పత్తులను ప్రారంభించింది. ఇందులో పన్ను ఆదా ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, అంతర్జాతీయ ప్రయాణ బీమా, COVID-19 మహమ్మారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన కరోనా కేర్ లాంటి బీమా ఉత్పత్తులు ఉన్నాయి. 2018లో PhonePe తన స్విచ్ వేదికను కూడా ప్రారంభించింది. నేడు PhonePe మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులు నేరుగా Ola, Myntra, IRCTC, Goibibo, RedBus, Oyo లాంటి 260లకు పైగా భాగస్వాముల యాప్స్ లలో ఆర్డర్లు చేయవచ్చు. జాతీయ స్థాయిలో 500 నగరాల్లోని ఒక కోటి 30 లక్షలకు పైగా వ్యాపార దుకాణాల్లో PhonePe ద్వారా పేమెంట్లను అంగీకరిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 Nov,2020 02:10PM