హైదరాబాద్ : ఈ ఏడాది సినీ ఇండ్రస్టీకి పెద్దగా అచ్చోచ్చినట్టుగా లేదు. కరోనా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా టీవీ నటుడు అషీష్ రాయ్ (55) అనారోగ్యంతో కన్నుమూశారు. మూత్ర పిండాల వ్యాధితో కొద్ది రోజులుగా బాధపడుతున్న ఆయన మృతి చెందారు. ఆయన ఇటీవలి కాలంలో రెండు సార్లు డయాలసిస్ చేయించుకున్నాడు. వైద్యం చేయించుకునేందుకు డబ్బు కూడా లేకపోవడంతో రోజురోజుకి ఆరోగ్యం క్షీణించి కన్నుమూసారు. మేలో ఆసుపత్రిలో చేరిన అషీష్‌కు వైద్యం చేయించుకునే పరిస్తితి లేదు. సరైన ఆఫర్స్ రాకపోవడం, లాక్‌డౌన్ పరిస్థితుల ప్రభావం అషీష్ ఆరోగ్యంపై బాగా ఎఫెక్ట్ చూపించింది. ఈ రోజు తన ఇంటి వద్దే అషీష్ మరణించారు. ఈ విషయాన్ని సీఐఎన్‌టీఏఏ సీనియర్ జాయింట్ సెక్రటరీ అమిత్ బెహ్ల్ ధృవీకరించారు.
Mon Jan 19, 2015 06:51 pm