హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో నేతలకు ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు. ప్రచారంలో పాల్గొంటున్న మంత్రులు, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలకు పలు చోట్ల నిరసన సెగలు తప్పడంలేదు. అసలే వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన హైదరాబాదీలు.. ఎన్నికల ప్రచారం కోసం తమ ముందుకు వస్తున్న నేతలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, ఇవాళ, మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు చేదు అనుభవం ఎదురైంది. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఖైరతాబాద్ పరిధిలోని చందానగర్‌లో ప్రచారానికి వెళ్లారు గంగుల, దానం.. తమకు వరద సాయం అందలేదని, వరదలతో కష్టకష్టాలు పడితే మమ్మల్ని పట్టించుకున్న నాథుడే లేడంటూ తిరగబడ్డారు స్థానికులు.. దీంతో.. అక్కడి నుండి వెనుదిగిరి వెళ్లిపోయారు మంత్రి గంగుల, ఎమ్మెల్యే దానం.
Mon Jan 19, 2015 06:51 pm