హైదరాబాద్: చిన్నారులలోని ప్రతిభను ప్రోత్సహించడం కోసం హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సిటీ లైఫ్ మేగజైన్ మాక్ తారిక్ చిన్న పిల్లల కోసం ఫ్యాషన్ షోని నిర్వహించారు. ఈ ఫ్యాషన్ షోని హోటల్ లె మెరీడియన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ప్రముఖ డాక్టర్, డైరెక్టర్, సామాజిక కార్యకర్త డా.ఆనంద్ విచ్చేసి పిల్లలకు శుభాకాంక్షలు తెలిజేసారు. ఈ సందర్భంగా పిల్లలో ఉన్న ప్రతిభను గుర్తించి, చదువుతో పాటు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేటట్లు తల్లితండ్రులు ప్రోత్సహించడం అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ మోడల్స్ సుధాజైన్, ప్రియాంక, మీనా తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm