హైదరాబాద్ : రీల్ హీరోలను అందరినీ వెనక్కి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. తన ఔదార్యంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సోనూ.. తాజాగా మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్లను కలిగివున్న భారతీయుల్లో టాప్-4కు దూసుకెళ్లాడు. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ తొలి స్థానంలో ఉండగా, ఆ తరువాత అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్లను కలిగివున్న వారిలో రాహుల్ గాంధీ, విరాట్ కోహ్లీ ఉన్నారు. నాలుగో స్థానంలో సోనూ సూద్ నిలిచారని సోషల్ మీడియా అనలిటిక్స్ వెల్లడించింది. ఈ క్రమంలో బాలీవుడ్ లో ఖాన్ ల త్రయంతో పాటు, అందరు సూపర్ స్టార్లను, ప్రధాన రాజకీయ నాయకులను సోనూ సూద్ దాటి రావడం గమనార్హం. ఇటీవలే సోనూను పంజాబ్ ప్రభుత్వం తమ రాష్ట్ర ఐకాన్ గా నియమించుకున్న సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm