హైదరాబాద్ : మహారాష్ట్రలోని రబోడి ప్రాంతంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎం.ఎన్.ఎస్) నాయకుడు జమీల్ షేక్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బైక్‌పై అనుసరించిన దుండగులు జమీల్‌పై రద్దీగా ఉండే మార్కెట్లో కాల్పులకు తెగబడ్డారు. దీంతో జమీల్ అక్కడికక్కడే బైక్పై కుప్పకూలిపోయారు. స్థానికులు దగ్గరోని బృహస్పతి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జేజే ఆసుపత్రికి తీసుకెళ్లారు.
Mon Jan 19, 2015 06:51 pm