హైదరాబాద్ : దేశంలో కరోనా కొత్త కేసులు కాస్త నెమ్మదించాయి. సోమవారం 37,975 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 91లక్షల 77వేల 840కి పెరిగింది. మరో 480మంది వైరస్‌తో మృతి చెందగా.. మరణాల సంఖ్య 1,34,218కి చేరింది. కరోనా సోకిన వారిలో ఇప్పటివరకు 86లక్షల 4వేల 955 మంది కోలుకున్నారు. 4లక్షల 38వేల 667 యాక్టివ్ కేసులున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm