హైదరాబాద్ : టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ షాకింగ్ కామెంట్స్ చేసారు. హైదరాబాద్ అభివృద్ధికి నిరోధకంగా ఈ రెండు పార్టీలు మారయని అలీ అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం పంచాయతీ అంతా డ్రామా అని పేర్కొన్న అయన ఎంఐఎం మేము మిత్రులం అని సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనే చెప్పారని అన్నారు. దేశంలోనే మిగులు విద్యుత్ ఉంది.. తెలంగాణ ఒక్క రాష్ట్రంలోనే కాదని అన్నారు. కేసీఆర్ మీ హయాంలో కిషన్ బాగ్ లో ఎన్కౌంటర్ కాలేదా.. . ఆలేరులో ఎన్కౌంటర్ కాలేదా..? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో ని నమ్మకండన్న అయన తండ్రి కొడుకులవి అబద్ధాలేనని అన్నారు. నేను చెప్పింది అబద్దం అని చెప్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm