హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ చెందిన అభ్యర్థిపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. వివరాల ప్రకారం.. నాంపల్లి నియోజకవర్గంలోని విజయనగర్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఇనాయ ఫాతిమాపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఫేక్ డాక్యుమెంట్స్‌తో బీసీ ఈ సర్టిఫికెట్ పొందినట్టు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ముషీరాబాద్ ఎంఆర్ఓ జానకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇనాయ ఫాతిమాపై 420,468,471 ఐపీసీ సెక్షన్ల కింద ముషీరాబాద్ పోలీసులు చీటింగ్ కేసును నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm