హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో చేదు వార్త. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. అది 24 గంటల్లో మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ వాయుగుండం తుపానుగా మారితే దీన్ని నివర్ తుపానుగా పిలుస్తారు. ప్రస్తుతం ఈ వాయుగుండం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశలో 500 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి ఆగ్నేయంగా 590 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది క్రమేపీ వాయువ్య దిశగా కదులుతూ బుధవారం (నవంబర్ 25) నాటికి కారైక్కాల్, మామల్లపురం వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తమిళనాడుతో పాటు ఏపీ, తెలంగాణలకు కూడా తుపాను ముప్పు పొంచి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm