హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలను నిర్వహించేందుకు తాము సిద్ధమని ఎన్నికల సంఘం చెబుతుండగా... కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం చెబుతోంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే రెండు సార్లు చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ లేఖ రాశారు. అయితే, ఆమె నుంచి సరైన ప్రతిస్పందన రాలేదు. దీంతో, ఆమెకు నిమ్మగడ్డ రమేశ్ మూడోసారి లేఖ రాశారు. అంతేకాదు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏపీ హైకోర్టు తీర్పు కాపీని కూడా తన లేఖకు జత చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థలకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు తీర్పును వెలువరించిందని లేఖలో తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కోరారు. ఈ లేఖపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Mon Jan 19, 2015 06:51 pm