హైదరాబాద్ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన చిత్రం 'మిడిల్ క్లాస్ మెలోడీస్'. వినోద్ అనంతోజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి ఆదరణ పోందుతుంది. ఇక తాజాగా ఈ చిత్రాన్ని హీరో నితిన్ చూసి ప్రశంసల వర్షం కురిపించాడు. 'మిడిల్ క్లాస్ మెలొడీస్ లవ్ లీ సినిమా. అందరి హృదయాలకు హత్తుకునే చిత్రం. భవ్యక్రియేషన్స్ కు , నా నిర్మాత ఆనంద్ ప్రసాద్ కు శుభాకాంక్షలు. ఈ చిత్రంలోని నటీనటులంతా అద్భుతంగా నటించారు. తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమాను అందించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రబృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు' అని నితిన్ ట్వీట్ చేశాడు.
Mon Jan 19, 2015 06:51 pm