హైదరాబాద్ : కొద్దిరోజులుగా ఆంద్రప్రదేశ్ లో కరోనా ప్రభంజనం కొనసాగింది. తాజాగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 47,130 మందికి టెస్టులు నిర్వహించగా కేవలం 545 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 117, తూర్పుగోదావరి జిల్లాలో 104, పశ్చిమగోదావరి జిల్లాలో 76 కేసులు నమోదు కాగా... కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 10 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 10 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
Mon Jan 19, 2015 06:51 pm