హైదరాబాద్ : తుంగభద్ర పుష్కరాల్లో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. దీంతో అధికారులు తగు జాగ్రతలపై దృష్టి సారించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో జరుగుతున్న తుంగభద్ర పుష్కరాల్లో దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పాలనాధికారి శృతి ఓజా అధికారులను ఆదేశించారు. పార్కింగ్ ప్రదేశం నుంచి ఆలయానికి చేరుకోవడానికి వాహనాలను సమకూర్చాలన్నారు. దివ్యాంగులు అమ్మవారి దర్శనం చేసుకునేందుకు పుష్కరఘాట్ల వద్ద వీల్ఛైర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా దృష్ట్యా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆమె తెలిపారు. శాంతిభద్రతల పర్యవేక్షణ, ట్రాఫిక్ సమస్యలపై జిల్లా ఎస్పీ రంజన్ రతన్కుమార్తో కలెక్టర్ చర్చించారు.
Mon Jan 19, 2015 06:51 pm